www.apstatekapunadu.com
కాపుల్ని బీసీల చేర్చాలని డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కాపు ముద్దుబిడ్డ సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతి వరకు జరుగుతున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు
సానా ప్రసాద్ కాపు బిడ్డ, ఒంగోలు వాస్తవ్యుడు ఆంధ్రప్రదేశ్ కాపు, బలిజ, తెలగ, ఒంటరి BC రిజర్వేషన్స్ సాధన సమితి వ్యవస్థపక అధ్యక్షుడు 08.06.'25 న చిత్తూరు నుండి అమరావతి వరకు కాపు పెద్దల సౌజన్యముతో, ఎలాంటి రాజకీయ పార్టీలకు గ్రూపులకు అతీతముగా ప్రారంభించిన శాంతియుత పాదయాత్ర తిరుపతికి కాళహస్తి రాజంపేట మీదుగా కడప కర్నూల్ తరువాత ప్రకాశం జిల్లా లో హైవే లోకి వస్తారు తిరుపతిలో రాయలసీమ కాపు పెద్దలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని తదుపరి రాజంపేట కు చేరుచున్న పాదయాత్ర. చిత్తూరు నుండి రేణిగుంట వరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పెద్దలు, యువత పిల్లలు అందరూ సానా ప్రసాద్ తలపెట్టిన శాంతియుత పాదయాత్రకు చేయూత నిచ్చి వెన్నంటి ప్రోత్సహం చూపించినరు. జరుగుచున్న పాదయాత్ర కు మద్దతుగా నిలిచినా కాపు బలిజ ఒంటరి తెలగ పెద్దలకు మహిళలకు యువకులుకు అందరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు.