www.apstatekapunadu.com
జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్ పులి వెంకట రంగారావు
జగ్గంపేట పట్టణ ప్రముఖ కాపు నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జగ్గంపేట నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన పులి వెంకట రంగారావు, కాపుల అభ్యున్నతికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్న పులి వెంకట రంగారావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తన నియామకానికి సహాయ సహకారాలు అందించిన జగ్గంపేట నియోజకవర్గ కాపు నాయకులకు, జిల్లా కమిటీ సభ్యులకు, రాష్ట్ర కమిటీ సభ్యులకు, జాతీయ కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కాపునాడు సేవా సమితి నియమ నిబంధనలను అనుసరిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని, సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని పేర్కొన్నారు.
కాపు సామాజిక వర్గ అభివృద్ధి, సంక్షేమం మరియు హక్కుల సాధన కోసం సమితి తీసుకునే నిర్ణయాలను తూచా తప్పకుండా అనుసరిస్తానని తెలిపారు. కాకినాడ జిల్లాలో కాపునాడు సేవా సమితి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సమాజ సేవలో చురుగ్గా పాల్గొంటానని పులి వెంకట రంగారావు వెల్లడించారు.