www.apstatekapunadu.com




అనుదీప్ హత్య పై విచారణ జరపాలి హంతకులను అరెస్ట్ చేయాలి -చందు జనార్దన్ 

కుట్ర దారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి -
లేని పక్షం లో చాట్రాయ్ లో నిరవధిక నిరసన చేస్తా—రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ 

అంబటి అనుదీప్ హత్య పై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాపు జే ఏ సీ అధ్యక్షులు చందు జనార్ధన్.శనివారం విజయవాడ లో ఆయన కాపు జే ఏ సి కార్యాలయం లో  మాట్లాడుతు నూజివీడు నియోజక వర్గం లో చా ట్రాయ్ లో కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణం హత్యేనని మండలం అంతా ఘోషిస్తువుంటే స్థానిక స్టేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారని చందు జనార్దన్ ఆరోపించారు.ఈరోజు చట్రాయ్ లో అనుదీప్ యొక్క దశదినకర్మ ను కుటుంబం నిర్వహించిందని అంబటి అనుదీప్ కి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి కాపు జే ఏ సి పక్షాన సానుభూతిని తెలియ చేశారు.
అనుదీప్ ది హత్యేనని చా ట్రాయ్ పోలీస్టేషన్ లో తండ్రి అంబటి గోపాలరావు ఫిర్యాదు చేశారు.కానీ స్టేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు 
అనుదీప్ హత్యపై మండల నాయకత్వం,మరియు జనసేన నాయకులు జగన్ రాష్ట్ర కాపు జే ఏ సి నాయకత్వం సంఘటన పై వివరించగా బుధవారం వెంటనే 3 గంటలకు అనుదీప్ నివాసానికి వెళ్లడం జరిగింది.కాపు కుటుంబ సభ్యులు మండల నాయకత్వం 300 మంది రావడం వారందరి ఆవేదన వినడం సమావేశం జరపడం జరిగింది 
అనుదీప్ తండ్రి మాట్లాడుతూ తన కుమారుడిని హతమార్చారని,పోలీస్ యంత్రాంగం పూర్తిగా నేరస్తులకు వంత పాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అదే బాటలో అక్కడ ఉన్న అందరూ స్పష్టం చేయడం జరిగింది.
అనుదీప్ హత్య పై సమగ్ర దర్యాప్తు చేయాలి దోషులను కఠినంగా శిక్షించాలి 
 నేరస్తులకు వంత పాడిన స్టేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి కుట్రలో భాగస్తులను అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ నేడు డిమాండ్ చేశారు.
జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాలపై వెంటనే చర్యలు తీసుకొపోతే రాష్ట్ర కాపు జే ఏ సి  చా ట్రాయ్ లో నిరవధిక నిరసన కార్యక్రమం చేపడుతుందని ప్రకటించారు
www.apstatekapunadu.com


బాపూజీ వృద్ధాశ్రమంలో అన్నదానం
యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలు

చిలకలూరిపేట 

పట్టణానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోవిందు శంకర శ్రీనివాసన్ తన మనవరాలు యషిక క్షేత్ర పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా స్థానిక చీరాల రోడ్డులో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమంలో ఘనంగా అన్నదానం నిర్వహించారు.
ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమంలోని వృద్ధులను గోవిందు శంకర శ్రీనివాసన్ స్వయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన మిత్రులతో కలిసి వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు వెంకట సత్య సాయి కిరణ్ మరియు డాక్టర్ గోవిందు తేజస్విని దంపతుల కుమార్తె అయిన యషిక క్షేత్ర పుట్టినరోజును గౌరవ వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.వృద్ధుల ఆశీస్సులు చిన్నారి భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులందరూ యషిక క్షేత్రను ఆశీర్వదించాలని కోరారు.వృద్ధులను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న బాపూజీ వృద్ధాశ్రమం నిర్వాహకులు మురికిపూడి ప్రసాద్, ఆరాధ్యుల రామకృష్ణలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్ అల్లిమియా, షబ్బీర్, తోట లక్ష్మీనారాయణ, వట్టెం శ్రీనివాసరావు, నిమ్మల మురళీకృష్ణ తదితరులు పాల్గొని యషిక క్షేత్రకు శుభాకాంక్షలు తెలియజేశారు.
www.apstatekapunadu.com


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మున్నూరు కాపు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు

మున్నూరు కాపు మేయర్స్

1. కరీంనగర్ - కొలగాని శ్రీనివాస్ 
2. మంచిర్యాల - ధర్ని మధుకర్


మున్నూరుకాపు చైర్మన్స్

1. గజ్వెల్ - గంగిశెట్టి చందన రవీందర్ 
2. బెల్లంపల్లి - దావ స్వాతి రమేష్ 
3. జగిత్యాల - సమిండ్ల వాణి శ్రీనివాస్
4. భైంసా -తుమ్మెల్ల దత్తాత్రి 
5. నిర్మల్-అప్పాల కావ్య గణేష్
6. మెదక్- కానుగ రాధిక
7. నాగర్ కర్నూల్- తీగల సునీంద్ర
8. చెన్నూరు- పెద్ధింటి పద్మా శ్రీనివాస్
9. బాన్సువాడ- కాసుల విజయ బాలరాజు
10. ములుగు- చింతనిప్పుల చంద్రకళ
11. వేములవాడ- పుల్కాం రాజు.
12. పెద్దపల్లి -నుగిళ్ళ మల్లన్న
13. ఆదిలాబాద్- బండారి అనూష సతీష్

పటేళ్లు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శుభనాగేశ్వరరావు
www.apstatekapunadu.com


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు

 *మొన్న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ మున్సిపల్ చైర్మన్గా 13 మంది అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ గా మున్నూరు కాపులు ఎన్నిక కావడం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు తెలంగాణలో ఎన్నికైన మున్నూరు కాపు మున్సిపల్ చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ లకు వివిధ వార్డుల్లో ఎన్నికైన మున్నూరు కాపు కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు పేరుపేరునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున శుభాభినందనలు తెలియజేయడం జరిగింది*

 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేట్ జాతి అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వర రావు మాట్లాడుతూ  త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో అలాగే కార్పొరేషన్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి తరుపున జనాభా దామేషా ప్రకారం కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున డిమాండ్ చేస్తున్నాం*
 
*గత సార్వత్రిక ఎన్నికలలో  ఎన్డీఏ కూటమి విజయోత్సవానికి ఎంతో కృషిచేసిన కాపు సామాజిక వర్గం వారిని గుర్తించి రేపు జరగబోవు మున్సిపల్ ఎన్నికలలో తప్పనిసరిగా కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపురాడు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము*

 *ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాధా రంగా మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోట సత్యం కాపునాడు ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు సనాతన కమిటీ కన్వీనర్ తోట సతీష్ తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు*
www.apstatekapunadu.com








కాపుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి నెల్లూరు ప్రముఖ  కాపు నాయకురలైన   నెల్లూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు  నున్న రాధికా తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు ద్వారా నియామక పత్రం అందుకున్న నున్న రాధికా ఈ నియామకానికి సహాయ సహకారాలు అందించిన నెల్లూరు నియోజకవర్గ కాపు నాయకులకు రాష్ట్ర కమిటీ వారికీ జాతీయ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు కాపునాడు నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తానని కాపునాడు సేవా సమితి చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి వారి హక్కుల సాధన కోసం కమిటీ వారు తీసుకునే అన్ని నిర్ణయాలను తూచా తప్పకుండా  నెల్లూరు జిల్లా లో అనుసరిస్తానని అలాగే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటానని తెలియజేశారు
www.apstatekapunadu.com





కొండవీటి కోటపై శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటు గురించి జిల్లా ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరిగింది 

 కొండవీడు కోటలో ఫిబ్రవరి 7 8 తారీకులలో కొండవీటి చరిత్ర తెలియజేయడానికి కొండవీడు ఫెస్టివల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటు అయిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు నుంచి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారికి జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఫారెస్ట్ అధికారులకు విగ్రహ ఏర్పాటు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తామని తెలియజేయడం జరిగింది 
www.apstatekapunadu.com



కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది


విజయనగర సామ్రాజ్య చక్రవర్తి *శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి 555 జయంతి వేడుకలలో* భాగంగా వారిని స్మరించుకుంటూ *కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ది. 27-1-2026 మంగళవారం ఉదయం 10-00 గంటలకు* చిలకలూరిపేట, 25వ వార్డు జాగుపాలెం నందు గల యానాది కాలనీలోని పేదలకు *దుప్పట్లు*  మరియు *దోమతెరలు*  పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

 *తదుపరి భాస్కర్ హాల్ సెంటర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు నాయకులు అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఘనత గురించి అలాగే ఆ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించడం జరిగింది*

 *శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీశైలం దేవస్థానం శ్రీకాళహస్తి దేవాలయం అలాగే ఎన్నో దేవాలయాల నిర్మాణం చేయడం శ్రీకృష్ణదేవరాయలకే సాధ్యమైందని ఈ సందర్భంగా పాల్గొన్న కాపు నాయకులు మాట్లాడటం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సంఘం నాయకులు ఉయ్యూరు నరసింహారావు గోవిందు శంకర్ శ్రీనివాసన్ మల్లెల శివ నాగేశ్వరరావు ఊస రమేష్ ఊస రాఘవ వాట్టెం శ్రీనివాస్ రామిశెట్టి శివప్రసాద్ రంగిశెట్టి పూర్ణచంద్రరావు మంగు నాగరాజు పక్కల రమేష్ ఇంటూరి శివ నాగేశ్వరరావు బందరు కృష్ణ ప్రసాద్ కమ్మిలి శివరామకృష్ణ మిరియాల లక్ష్మీనారాయణ మారెళ్ళ శ్రీనివాసరావు శంకరపు పిచ్చయ్య భవనం శ్రీనివాసరావు పువ్వాడ నాగు తంగేళ్ల శివప్రసాద్ తంగేళ్ల రామ్మోహన్ రావు కోట చంద్ర తదితర కాపు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
www.apstatekapunadu.com




 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరఫున ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కమిటీలు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున కాపు నాయకులు అభిమాను లు అందరూ తమ తమ బయోడేటాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడుకి పంపవలసిందిగా కోరుచున్నాము