ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రవిశంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కంది రవిశంకర్ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. తన వియ్యంకుడు, సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో పాటు రవిశంకర్ జనసేనలో చేరనున్నారు. జనసేనలో చేరటంపై ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రోశయ్య త్వరలో జనసేనలో చేరుతున్నారు అలాగే ప్రకాశం జిల్లాలో రవిశంకర్ చేరిక వార్త రాజకీయ వర్గాల్లో గుప్పుమంది. కాపు సామాజికవర్గానికి చెందిన రవిశంకర్ కు ఒంగోలులో అన్ని వర్గాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఎన్నో సంవత్సరాల నుండి తన సంస్థల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అండగా నిలబడ్డారు కాబట్టి ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన చేరికతో మరింత బలం చేకూరు నుంది....
Post A Comment:
0 comments: