గ్రామానికొక బొబ్బిలి బ్రహ్మన్నగా కాపు , తెలగ , బలిజ , ఒంటరి కులస్థులు శతాబ్దాలు పాటు కొనసాగారు. గ్రామ పాలన, చట్టాలు, నిర్వహణ మొదలుకొని నూటొక్క అవిభాజ్య సామ్రాజ్యాలను కాపులు పాలించారు. నేటి పాలక వర్గాల ఉనికేలేని రోజుల్లో కాపులు సామ్రాజ్యాధినేతలుగా ఉండేవారు. ఇది కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. కాని అటువంటి పరిస్థితి నుంచి కాపులు రాజ్యాధికారం పోరాటం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది.
ఎన్ని తరాలైనా కాపులు పరిస్థితి జనం....మరణం అని రాసుకుంటానికి తప్ప దేనికి ఉపయోగా పడట్లేదు
స్వాతంత్రం రాకముందు అన్ని రంగాల్లో ముందుండిన కాపు సమాజికి వర్గం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో అనేక రకాలుగా వెనుకబడిపోయారు... కర్ణుడి చావుకు వంద కారణాలన్న చందంగా కాపు కులం వెనుకబాటుతనానికి అనేక కారణాలు తోడయ్యాయి...సామాజిక అంతస్తులో కంటే చాలా దిగువన ఉన్న కులాలు ఈనాడు ఆర్థికంగా సామాజికంగా ఎంతో ముందుకు పోతున్నాయి...అదే సమయంలో కాపు కులం పట్ల రాజకీయ కక్షలు, వివక్షలతో కొన్ని శక్తులు మన జాతిని అణగదొక్కాయి,ఇంకా అణగదొక్కుతూనే ఉన్నాయి...దీనికి కారణాలు తెలిసినప్పటికీ వాటిని సరిదిద్దుకునే చర్యలు మనం తీసుకోలేక పోయాం...కాపు కులంలో పుట్టిన ఎందరో వ్యక్తులు అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నప్పటికీ వారు చేరుకోవాల్సిన స్థితిని చేరుకోలేక పోతున్నారు.కాపు యువకుల్లో సమాజం కొరకు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఎంతగానో ఉన్నప్పటికీ వారికి ప్రోత్సాహం లభించడం లేదు...
కాపులు చీలికలు పీలికలుగా విడిపోయి కొట్టుకు చస్తున్నారు అనేది అక్షర సత్యం ఇటువంటి కాపులను, కాపు నాయకులను కలపాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. వీరి జ్ఞాన నేత్రాలు తెరిపించాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి పెద్దలు ముందుకు రావాలి. అలానే కాపుల్లోను, కాపు అంధ మేధావుల్లోను, కాపు నాయకుల్లో కూడా మార్పు రావాలి. వీరు అంతా కూడా కాపు పెద్దలకి సహకరించాలి. ప్రతీ కాపు తమ జ్ఞాన నేత్రాన్ని తెరవాలి. తోటి సహచర అణగారిన వర్గాలతో కలిసి పనిచేయాలి.అప్పుడే మనకి రాజ్యాధికారం దక్కుతుంది అనే స్థాయికి కాపులు ఎదగాలి.అలానే మార్పు కోసం మేము ముందుకు వస్తాం అనే కాపు నాయకులను, సహచర అణగారిన వర్గాల నాయకులను కలుపుని వెళ్ళాలిసిన బాధ్యత అందరిపై ఉంది. వ్యక్తిగత లేదా జాతిని నిర్వీర్యం చేసే వీరి విమర్శలు మానుకోవాలి
కాపులంతా సోదర అణగారిన వర్గాలతో, మిగిలిన అగ్ర వర్ణాలతో కలిసి నడుం బిగించాలి. రాజ్యాధికారం సాధించిన రోజునే మా జాతుల మనుగడ సాగుతుంది అనే మనోవికాసం కాపుల్లో రావాలి. అప్పుడే కాపులకి రాజ్యాధికారం ఆలోచించండి.. ఈ దిశగా అడుగులు ముందుకు వేయండి.
Post A Comment:
0 comments: