కాపు జాతి గతం నుంచి అన్ని రంగాల్లో తమ ప్రావిణ్యతను చాటుకుంటునే ఉంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విజయ బావుటా ఎగురవేసిన తొలితరం కాపు బిడ్డ స్వర్గీయ పైడి జయరాజ్ నాయుడు .
వీరు మద్రాసు నగరం లోని బలిజ నాయుడు కులానికి చెందిన వారు. వీరి పూర్వీకులు మద్రాసు నగరం వీడి హైదరాబాద్ నిజాం నవాబుల కాలంలో తెలంగాణ లో స్థిర పడ్డారు. జైరాజ్ నాయుడు మేనమామ హైదరాబాదు నిజాం కొలువులో పనిచేసి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన మేజర్ ముత్యాల గోవింద రాజులనాయుడు . ( భారత కోకిల శ్రీమతి సరోజినీ నాయుడు భర్త).
జైరాజ్ నాయుడు 1909 సంవత్సరం సెప్టెంబరు 28న కరీంనగర్ లో జన్మించారు.వీరు హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివి అనంతరం సినిమాలపై వ్యామోహంతో 1929లో ముంబాయి చేరుకున్నారు. తన ఇరవైయ్యో యేట 1930 లో తొలిసారిగా " స్పార్క్లింగ్ యూత్ " అనే మూకీ చిత్రంలో నటించారు. అదే సంవత్సరంలో " ట్రయంఫ్ ఆఫ్ లవ్ " అనే చిత్రంలో కథానాయకునిగా నటించారు. జైరాజ్ మొత్తం 11 మూకీ చిత్రాల్లో నటించారు. 1931 లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన " షికారి " ఉర్దూ చిత్రంతో టాకీల్లో ప్రవేశించారు. తర్వాత కాలంలో హిందీ లెజెండరీ డైరెక్టర్స్ వి.శాంతారాం, పృధ్వీరాజ్ కపూర్ లాంటి వారితో సమానంగా మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరూపా రాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి లాంటి హీరోయిన్ ల సరసన హీరో గా నటించారు. అనేక విజయాలనూ చవిచూశారు.

మూకీ' సినిమా రోజులలో 11 సినిమాలలో, తరువాత సుమారు 156 'టాకీ' సినిమాలలో కథానాయకుడిగా, విలక్షణమైన నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిందీ, ఉర్దూ భాషలతో పాటు, కొన్ని మరాఠీ, గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు ధరించినా ఇతను పోషించిన జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తుండేవి, ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే ఎక్కువ సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయి. తెలుగు నేలపై పుట్టినా బొంబాయి చిత్రసీమలో ప్రవేశించి హీరోగా ఎదిగి హిందీ, ఉర్దూ మొదలైన భాషల్లో సుమారు 170 చిత్రాల్లో నటించిన తెలుగువాడు మరియు కాపు జాతి గర్వించే గొప్ప వాడు పైడి జైరాజ్ నాయుడు .
జైరాజ్ నాయుడు భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన " దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును " 1980లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేసిగౌరవించింది.
Post A Comment:
0 comments: