రియల్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్న విలక్షణ నటుడు శ్రీహరి. టాలీవుడ్ లో శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.నేడు ఆయన వర్ధంతి. ఆయన తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు. రఘుముద్రి శ్రీహరి 1964 వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలోని ఎలమర్రులో జన్మించారు. ఆయన తన కెరీర్ ను స్టంట్ ఫైటర్ గా ప్రారంభించారు. ఆయన జిమ్నాస్టిక్స్ లో అథ్లెట్ కూడా. ఆయనకు పోలీస్, రైల్వే శాఖల్లో ఉద్యోగ ఆఫర్లు వచ్చినప్పటికీ సినిమాల మీద మక్కువతో ఆయన వాటిని తిరస్కరించారు. ముఠామేస్రి, ఘరానామొగుడు, తాజ్ మహల్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, విజయరామరాజు, మగధీర చిత్రాలు శ్రీహరికి ఎంతో గుర్తింపును తెచ్చాయి. హీరోగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా ఎన్నో విభిన్న పాత్రలను పోషించిన ఆయన రియల్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. నటి డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. ఆయన కుమార్తె 4 నెలల వయసులో చనిపోగా అక్షర ఫౌండేషన్ ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మేడ్చల్ లో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్టోబర్ 9, 2013 న ఆయన కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Post A Comment:
0 comments: