ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున బాపట్ల జిల్లా లో పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం
కార్యక్రమ స్వాగత ఉపన్యాసం చేసిన జాతియ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ సుమారు 30 నియోజకవర్గాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మేము వెళ్ళిన ప్రతిచోట సహాయ సహకారాలు ఇస్తున్న మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు
చీరాలనియోజకవర్గం కాపు నాయకులైన లక్కాకుల నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు బాపట్ల జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భం..
చీరాల కొత్తపేట డి.ఎస్.పి ఆఫీసు కు అతి సమీపంలో ఏర్పాటుచేసిన పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు చేతుల మీదుగా పదవి బాధ్యతలు స్వీకరించిన లక్కాకుల నాగేశ్వరరావు ఈ సందర్భంగా లక్కాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు
తదుపరి బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ చీరాల నియోజకవర్గ కాపు న్యాయవాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవాదుల విభాగ ప్రధాన కార్యదర్శిగా జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ రావు ద్వారా నియామక పత్రం అందుకున్న కనపర్తి రామారావు ఈ సందర్భంగా పదవి బాధ్యతలు స్వీకరించిన కనపర్తి రామారావు మాట్లాడుతూ కాపు సంఘానికి అవసరమైన ఉచిత న్యాయ సలహాలు ఇస్తూ వారికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా న్యాయపరమైన పోరాటం చేస్తానని తెలియజేశారు. చీరాల నియోజకవర్గంలో సంఘం ఏర్పాటు చేసే అన్ని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కాపు పెద్దలు పోలుదాసు రామకృష్ణ గారు వారు కాపు సంఘానికి గతం నుంచి ఇప్పటివరకు చేసిన సేవలు గురించి సమావేశానికి విచ్చేసిన వారందరికి తెలియజేశారు.ఈ సమావేశానికి విచ్చేసిన అందరూ కాపు సంఘ బలోపేతానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మరొక విశిష్ట అతిథి గొట్టిముక్కల నాగేశ్వరావు గారు మాట్లాడుతూ స్థానికంగా కాపు సంఘానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కు కాపు సంఘ సభ్యులు అందరూ కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
ఈ సమావేశాన్ని ఉద్దేశించి మామిడాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన సంఘాలు లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి వినూత్న రీతిలో పనిచేయాలని సంఘ సభ్యులను కోరారు
ఈ సమావేశంలో పాల్గొన్న మిరియాల శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను గత 30 సంవత్సరాల నుంచి వివిధ కాపు సంఘాలలో పని చేసిన తన అనుభవం గురించి సభకు విచ్చేసిన కాపు సంఘ నాయకులకు తెలియజేశారు. అలాగే చీరాల నియోజకవర్గంలో కాపు సంఘాన్ని బలోపేతని కి కృషి చేయాలని పదవి బాధ్యతలు స్వీకరించిన కనపర్తి రామారావు కు లక్కాకుల నాగేశ్వరావు గారికి విజ్ఞప్తి చేశారు.
అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు రెడ్డి లతా గారు మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో మహిళా సంఘాన్ని బలోపేతం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు.
అలాగే ఈ సమావేశం లో పాల్గొన్న ఆకిశెట్టి పుల్లయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి తరపున చీరాల నియోజకవర్గంలో కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంఘ సభ్యులను కోరారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు సంఘ సభ్యులు తోటా సతీష్ స్థానిక కాపు నాయకులు కాపు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
Post A Comment:
0 comments: