కార్యక్రమ స్వాగత ఉపన్యాసం చేసిన జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికీ సుమారు 30 నియోజకవర్గాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. మేము వెళ్ళిన ప్రతిచోట సహాయ సహకారాలు ఇస్తున్న మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు
ప్రముఖ కాపు నాయకులైన అంకిరెడ్డి రమేష్ నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భం..
స్థానిక మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో పట్టణ పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఏర్పాటుచేసిన పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా పదవి బాధ్యతలు స్వీకరించిన అంకిరెడ్డి రమేష్ నాయుడు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన జాతీయ కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే నియామక పత్రం అందజేసిన రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సభ్యులైన మల్లెల శివ నాగేశ్వరరావు తోట శ్రీనివాసరావు గోవింద శంకర్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ కమిటీల ఏర్పాటులో ఎంతో కృషి చేస్తా ఉన్నారని వారు చేస్తున్న ఈ కృషిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చేస్తున్న ఈ మహా యజ్ఞంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు.
తదుపరి బాధ్యతలు స్వీకరించిన చిలకలూరిపేట మహిళా అధ్యక్షురాలు ఏకాంబరపు సునీత రాష్ట్ర ఉపాధ్యక్షులైన ఏనుగుల వెంకటేశ్వర్లు ద్వారా నియామకం పత్రం అందుకొని తనకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని సంఘ అభివృద్ధికి కాపు మహిళ అభివృద్ధికి కృషి చేస్తానని పదవి బాధ్యతలు స్వీకరించిన ఏకాంతపు సునీత తెలియజేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ నాయకులైన మల్లెల శివ నాగేశ్వరరావుకు తోట శ్రీనివాసరావు కు రాష్ట్ర గౌరవాధ్యక్షులైన గోవింద శంకర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
తదుపరి బాధ్యతలు స్వీకరించిన చిలకలూరిపేట నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గ్రంధి సత్యనారాయణ కు రాష్ట్ర కార్యదర్శి అయిన వట్టెం శ్రీనివాసరావు నియామకం పత్రం అందజేసి గ్రంధి సత్యనారాయణ ను అభినందించారు. నియామకం పత్రం అందుకున్న గ్రంధి సత్యనారాయణ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ కమిటీ వారికి రాష్ట్ర కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు కుటుంబంలోకి తను రావటం తనకు ఎంతో ఆనందం కలిగించిందని తనవంతుగా అలాగే మీడియా పరంగా కాపునాడు సేవా సమితికి చిలకలూరిపేట నియోజకవర్గంలో సంఘం ఏర్పాటు చేసి అన్ని కార్యక్రమంలో పాల్గొంటానని తెలియజేశారు.
తదుపరి చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన చౌడవరపు రామారావు గారి చేతుల మీదుగా నియామకం పొందిన సూరం రవికుమార్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో కాపునాడు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూరం రవికుమార్ కు తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన సూరం రవికుమార్ మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలో తన ఆధ్వర్యంలో కాపునాడు కమిటీలు ఏర్పాటు చేస్తానని తెలియజేశారు.
తదుపరి ప్రముఖ కాపు నాయకులైన నరసింహారావు చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న చిలకలూరిపేట పట్టణ మీడియా ఇంచార్జ్ కటారి సుధాకర్ నాయుడు. నియామక పత్రం అందజేసిన నరసింహారావు మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారానికి ముందుండి పనిచేస్తున్న కాపు సంఘం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి మాత్రమేనని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉయ్యూరు నరసింహారావు మాట్లాడుతూ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాపు నాయకులు అంకిరెడ్డి రమేష్ నాయుడు మిత్రబృందం నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌడవరపు రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి వట్టెం శ్రీనివాసరావు తోట సతీష్ ఉయ్యూరు నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.
Post A Comment:
0 comments: