ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని పెదకాకాని మండల అధ్యక్షుడు తిరుమలశెట్టి మనోజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

 గుంటూరు జిల్లా పెదకాకానిలో ఏర్పాటుచేసిన వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వంగవీటి వారసుడు వంగవీటి నరేంద్ర అలాగే ప్రముఖ న్యాయవాది  జనసేన నాయకురాలు రజిని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అంకిరెడ్డి రమేష్ పెదకాకాని మండల అధ్యక్షుడు తిరుమల శెట్టి మనోజ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని వంగవీటి మోహనరంగా బడుగు బలహీన వర్గాలకు చేసిన కార్యక్రమాల గురించి అలాగే మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా  ఉన్న వంగవీటి చరిత్రను 36 సంవత్సరాలు గడిచినా కూడా కాపులు బడుగు బలహీన వర్గాల వారు మర్చిపోకుండా వర్ధంతి కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఎంతో ఘనంగా నిర్వహించడం వారి గొప్పతనానికి నిర్వచనం అని కొనియాడారు. తదుపరి  500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అంకిరెడ్డి రమేష్  నాయుడు వారి మిత్ర బృందం జనసేన నాయకురాలు రజిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: