ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
 
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర కార్యాలయంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపుల ఆరాధ్య దైవమైన కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది తదుపరి చిలకలూరిపేట భాస్కర్ థియేటర్ వద్దగల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా కాపులకే కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. చివరిసారిగా బడుగు బలహీన వర్గాల  ఇండ్ల పట్టాల కోసం విజయవాడ రాఘవయ్య పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగా ని అత్యంత పాసవికంగా అత్యంత క్రూరంగా  శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న మోహన రంగాని చంపడం ఎంతో విచారకరమని గుర్తు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు వంగవీటి మోహనరంగా ఆసియా సాధన కోసం కృషి చేయాలని వారు చూపిన అడుగు జాడల్లో నడవాలని వారి విగ్రహం ముందు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి  తోట శ్రీనివాసరావు  రాష్ట్ర గౌరవ అధ్యక్షులు  గోవింద్ శంకర్ శ్రీనివాసన్  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  అంకిరెడ్డి రమేష్ నాయుడు చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు సూరం రవి  చిలకలూరిపేట నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జి  గ్రంధి సత్యనారాయణ  కాపు నాయకులు వరికూటి నాగేశ్వరరావు  అమ్మిశెట్టి నాగేశ్వరరావు  పగడాల ఉమామహేశ్వరరావు పట్టణ మీడియా ఇన్ఛార్జ్ కటారి సుధాకర్ జనసేన నాయకులు టైలర్ ఏడుకొండలు కోట చంద్ర సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ చైర్మన్ తోట సతీష్ కుమార్ నాయుడు వడ్డీముక్కల  కిష్టారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Axact

కాపు నాడు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవాసమితి

Post A Comment:

0 comments: