నిన్న రాత్రి స్థానిక ప్రముఖ నాయకులైన కీర్తిశేషులు తోట భరతుడు గారి స్వగృహంలో వారి తనయులు తోట రామచంద్ర ప్రసాద్ గారు తోట రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గాంధీ ఇంటర్నేషనల్ క్లబ్ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంకిరెడ్డి రమేష్ నాయుడు కు విశిష్ట సేవ పురస్కారం గ్రహీత గా ఎన్నిక చేసి సన్మాన కార్యక్రమం చేసిన సందర్భంగా తోట రామచంద్ర ప్రసాద్ తోట రాజేంద్రప్రసాద్ గార్లు వారి స్వగృహమునందు కుటుంబ సభ్యులందరి సమక్షంలో అంకిరెడ్డి రమేష్ నాయుడుకు ఘన సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తోట రామచంద్ర ప్రసాద్ గారు తోట రాజేంద్ర ప్రసాద్ గారు వారి సతీమణి మరియు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే గాంధీ ఇంటర్నేషనల్ క్లబ్ చైర్మన్ ఘంటసాల బంగారు బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు బీసీ నాయకులు మాదాసు పృథ్వి అంకిరెడ్డి రమేష్ మిత్ర బృందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అంకిరెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అందరూ కూడా అంకిరెడ్డి రమేష్ నాయుడు చేసిన సేవా కార్యక్రమాలు గురించి తెలియజేసి అభినందించారు.
Post A Comment:
0 comments: